విద్యార్థుల సంక్షేమానికి గద్దె విజయ్ నేత సేవా కార్యక్రమం.
అరవింద్ కుమార్ గౌడ్ జన్మదినం సందర్భంగా 150 మంది విద్యార్థులకు నోట్‌బుక్స్, స్వీట్స్, మిల్క్ షేక్స్ పంపిణీ.
విశ్వంభర, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని టిడిపి ఆడ్‌హాక్ కమిటీ సభ్యులు, బి.ఎన్.రెడ్డి డివిజన్ టిడిపి కంటెస్టెడ్ కార్పొరేటర్ అభ్యర్థి గద్దె విజయ్ నేత ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపయోగపడేలా ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బి.ఎన్.రెడ్డి డివిజన్ పరిధిలోని మోడల్ పాఠశాలలో సుమారు 150 మంది విద్యార్థులకు నోట్‌బుక్స్, స్వీట్స్, మిల్క్ షేక్స గద్దె విజయ్ నేత చేతుల మీదుగా పంపిణీ చేశారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి తన వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గద్దె విజయ్ నేత మాట్లాడుతూ, విద్యార్థులే దేశ భవిష్యత్తుకు పునాది అని, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని అన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు విద్యా సామగ్రి అందించడం ద్వారా వారి చదువుకు కొంతమేర అండగా నిలవచ్చని పేర్కొన్నారు.జన్మదిన వేడుకలను కేవలం శుభాకాంక్షలు, వేడుకలకు పరిమితం చేయకుండా విద్యార్థుల కోసం సేవా కార్యక్రమంగా నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా విద్యార్థులు, పేదలు, నిరుపేద కుటుంబాలు మరియు అవసరంలో ఉన్న వారికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని గద్దె విజయ్ నేత తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులకు నోట్‌బుక్స్, స్వీట్స్,మిల్క్ షేక్స్ అందజేయడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం నిర్వాహకులు విద్యార్థులతో కలిసి జన్మదిన వేడుకలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, సంతోష్, మహేష్ నేత, మల్లేష్, రాజు, కవిత, జయమ్మ, మాధవి, విజయలక్ష్మి, లావణ్య, స్రవంతి తదితరులు పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.



