ఉత్తరాఖండ్‌లో రోబోటిక్ డాగ్స్‌తో భారత్‌–అమెరికా సైనిక విన్యాసాలు

ఉత్తరాఖండ్‌లో రోబోటిక్ డాగ్స్‌తో భారత్‌–అమెరికా సైనిక విన్యాసాలు

  • ‘యుద్ధ్ అభ్యాస్ 2026’లో కౌంటర్ టెర్రరిజం డ్రిల్

Yudh Abhyas 2026: ఉత్తరాఖండ్‌లోని ఔలీ ప్రాంతంలో భారత్‌–అమెరికా ఆర్మీ బలగాలు సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ‘యుద్ధ్ అభ్యాస్ 2026’లో భాగంగా కౌంటర్ టెర్రరిజం, భవనాల క్లియరెన్స్‌కు సంబంధించిన ప్రత్యేక డ్రిల్‌ను నిర్వహించారు.

ఈ విన్యాసాల్లో భారత, అమెరికా బలగాలకు చెందిన అసాల్ట్ టీమ్స్ ప్రత్యేక ఆపరేషన్‌ను చేపట్టాయి. డ్రోన్లు, రోబోటిక్ డాగ్స్, ఆర్మీ శునకాలు, స్నైపర్ల సహకారంతో భవనాల క్లియరెన్స్ డ్రిల్ నిర్వహించినట్లు సమాచారం.

Read More చిన్నారులతో రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకున్న ప్రధాని మోదీ

ఆపరేషన్ సమయంలో ఆధునిక సాంకేతిక పరికరాలను సైనిక బృందాలు ఎలా సమన్వయంతో వినియోగించాలనే అంశంపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ముఖ్యంగా ప్రమాదకర ప్రాంతాల్లో సైనికుల ప్రత్యక్ష ప్రమేయాన్ని తగ్గించేందుకు రోబోటిక్ వ్యవస్థలు, డ్రోన్ల వినియోగాన్ని పరీక్షించినట్లు తెలుస్తోంది.

అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల్లో సంయుక్తంగా సైనిక ఆపరేషన్లు నిర్వహించగల సామర్థ్యాన్ని పెంచుకోవడమే ఈ విన్యాసాల ప్రధాన లక్ష్యంగా ఉంది. రెండు దేశాల సైనిక బలగాల మధ్య పరస్పర సమన్వయం, కమ్యూనికేషన్, వ్యూహాత్మక విధానాలను మెరుగుపరచడంపైనా దృష్టి సారించారు.

‘యుద్ధ్ అభ్యాస్’ భారత్‌–అమెరికా మధ్య నిర్వహించే వార్షిక సైనిక విన్యాసాల్లో ఒకటి. కౌంటర్ టెర్రరిజం, క్లిష్ట భూభాగాల్లో సంయుక్త ఆపరేషన్లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాల్లో ఇరు దేశాల సైనికులు తమ సామర్థ్యాలను పరస్పరం అభ్యసించుకుంటున్నారు.

Related Posts