టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు ఎమ్ అరవింద్ కుమార్ జన్మదినం సందర్బంగా ప్రభుత్వ పాఠశాలలో నోట్ బుక్స్ , ప్రోటీన్ మిల్క్ షేక్స్ పంపిణి
విశ్వంభర, ఎల్బీనగర్ :- తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎమ్ అరవింద్ కుమార్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని మల్కాజిగిరి టిడిపి అడ్ హక్ కమిటీ సభ్యులు, బి.ఎన్.రెడ్డి టీడీపీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ గద్దె విజయ్ నేత ఆధ్వర్యంలో ఎల్బీనగర్ లోని బి.ఎన్. రెడ్డి నగర్ డివిజన్ ఎన్జీవోస్ కాలనీ లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని 150 మంది విద్యార్థులకు నోట్ బుక్స్, స్వీట్స్, ప్రోటీన్ మిల్క్ షేక్ డ్రింక్స్ ను పంపిణి చేశారు. ఈ సందర్బంగా గద్దె విజయ్ నేత మాట్లాడుతూ తెలంగాణ తెలుగుదేశం పార్టీలో అరవింద్ కుమార్ గౌడ్ పాత్ర చాల కీలకమైందని , వారు నిరంతరం పార్టీ శ్రేయస్సు కోసం పాటు పడుతూ , బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడుతూ ముందుకు సాగుతున్నారని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తూ ప్రజలందరికి అందుబాటులో ఉండే నేత గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నత పదవులు చేపట్టాలని కోరుకుంటున్నాని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు వెంకటేశ్వర రావు , సంతోష్, మహేష్ నేత, మల్లేష్, రాజు, కవిత జయమ్మ , మాధవి విజయలక్ష్మి, లాస్య , స్రవంతి మొదలగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.



