పలు గణేష్ మండపాలలో డా. కాచం సత్యనారాయణ, సుష్మ దంపతులు ప్రత్యేక పూజలు
On
విశ్వంభర, హైదరాబాద్ :- ఎల్బీనగర్ నియోజకవర్గంలో పలు డివిజన్ లలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను విత్రీ న్యూస్ , విశ్వంభర దినపత్రిక ల చైర్మన డా. కాచం సత్యనారాయణ, సుష్మ దంపతులు సందర్శించి గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండపాల వద్ద అన్నప్రసాద కార్యక్రంలో పాల్గొన్నారు. మండపాల నిర్వాహకులు వారికి శాలువాతో సత్కరించారు. బాదం కాంప్లెక్స్ చైతన్యపురి గణేష్ యూత్ అసోసియేషన్ , కొత్తపేట , వాసవి కాలనీ జై శ్రీ రామ్ సమితి యూత్ , ద్వారకానగర్ యూత్ గ్రీన్ హిల్స్ కాలనీ , పలు మండపాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండపాల నిర్వాహకులు తదితరులు , భక్తులు పాల్గొన్నారు.



