పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలి. -గూడూరు శ్రీనివాస్ 

సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గ సమావేశం 

పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలి. -గూడూరు శ్రీనివాస్ 

విశ్వంభర,సిరిసిల్ల: చేనేత వస్త్ర వ్యాపార సంఘం భవనం లో జరిగిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కార్యవర్గ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ..ఈ సిరిసిల్ల పట్టణంలో 90 వేల నుండి 95 వేల వరకు మన పద్మశాలి కుల బంధువులు ఉన్నారు ఇప్పుడు మన పద్మశాలీలు అని రంగాలలో ముందు ఉన్నారు ఒక రాజకీయంలో తప్ప తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఇక్కడి పరిస్థితి అవగాహన చేసుకుని పద్మశాలీలను రాజకీయంగా ఎదిగేలా చేయాలని ఎంతో పట్టుదలతో నన్ను పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. వారు నాకు ఒక విషయం చెప్పారు ఏ రకంగా నైనా రాష్ట్రంలో పద్మశాలి కమ్యూనిటీ ఎదగాలి. రాజకీయంగా ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ స్థాయికి రావాలి అని నాకు ఖచ్చితమైన నిర్ణయంతో చెప్పారు. ముఖ్యమంత్రి  చెప్పిన విధంగా మన పద్మశాలి కులస్తులను ఒక తాటిపై తీసుకొచ్చి రాజకీయంగా ఎదిగేలా చేయటానికి త్వరలో రాష్ట్ర పర్యటన చేయటానికి సిద్ధంగా ఉన్నాం  వారు కోరుకున్న విధంగా రాష్ట్రంలో 15 మున్సిపల్ చైర్మన్ పదవి లో మన పద్మశాలీలు ఉన్నారు. అలాగే నాలుగు కార్పొరేషన్ చైర్మన్ లు గా నియమించారు. మీరు ఇప్పటికైనా గతాన్ని వదిలిపెట్టి రేవంత్ రెడ్డి మన పద్మశాలీల  మంచి కోసం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మనం కూడా సిద్ధమవుదాం మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా పక్కనే నేను ఉంటాను...

 సిరిసిల్ల చేనేత రంగానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, చేనేత కార్మికులు, వస్త్ర వ్యాపారులు కలిసి ఈ రంగ అభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
చేనేత కార్మికుల సంక్షేమం, వస్త్ర వ్యాపారుల సమస్యల పరిష్కారం, చేనేత ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాల పెంపు, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడం వంటి అంశాలపై నూతన కార్యవర్గం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
చేనేత రంగానికి సంబంధించిన సమస్యలను సమష్టిగా పరిష్కరించుకునేందుకు వ్యాపారులు, కార్మికులు, సంఘాల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. సిరిసిల్ల చేనేత ఉత్పత్తులకు మరింత మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పించి, చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
“చేనేత రంగ అభివృద్ధి – వస్త్ర వ్యాపారుల సంక్షేమం – చేనేత కార్మికుల శ్రేయస్సు” ...అనే లక్ష్యంతో నూతన కార్యవర్గం ముందుకు సాగాలని గూడూరు శ్రీనివాస్ ఆకాంక్షించారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షులు  తాటిపాముల దామోదర్, ప్రధాన కార్యదర్శి.  గాదవిష్ణు, కోశాధికారి సామల శ్రీనివాస్ మరియు కార్యవర్గ సభ్యులందరికీ మరోసారి శుభాభినందనలు తెలియజేస్తూ, వారి పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ యొక్క ప్రమాణస్వీకారా మహోత్సవంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర చీప్ విప్ ఆది శ్రీనివాస్, వీరవత్రి అనిల్ కుమార్, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్  దూడెం వెంకటరమణ, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ జక్కని అనిత, నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్, సంగీతం శ్రీనివాస్ఇంకా మున్సిపల్ చైర్మన్, వివిధ కార్పొరేషన్ చైర్మన్ లు ఇంకా పట్టణ ప్రముఖులు నాయకులు పాల్గొన్నారు

Read More నేను క్రిమినల్‌నా.. ఎక్కడికైనా పారిపోతున్నానా?: క్రిశాంక్

Tags: