పాతబస్తీలోని మండపాలనుసందర్శించిన సిపి సజ్జనార్, సౌత్ జోన్ డిసిపి కిరణ్ కారే
On
విశ్వంభర/ అలియాబాద్ :- గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అలియాబాద్ లోని పేరుగాంచిన శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ, ఆధ్వర్యంలో నెలకొల్పిన సిద్ధి వినాయక రూపంలోని గణనాయకుని దర్శించి న సీపీ సజ్జనార్, సౌత్ జోన్ డిసిపి కిరణ్ కారే, చత్రినాక ఏసీపీ చంద్రశేఖర్, ప్రత్యేక పూజలు అందుకున్నారు.అనంతరం సిపి సజ్జనార్ మాట్లాడుతూ సమయ పాలన పాటిద్దాం, కలసికట్టుగా పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకుందామo, అని కమిటీ సభ్యులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగ రాజు, డిసిసి వైస్ ప్రెసిడెంట్ తిరుపతి చందు, పి విశాల్, వై నరేష్, తేజ, ఆకుల ప్రదీప్, మరియు కమిటీ సభ్యులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.



