ప్రపంచ వేదికపై టీజీఎస్ ఆర్టీసీ ప్రతిభ

ప్రపంచ వేదికపై టీజీఎస్ ఆర్టీసీ ప్రతిభ

విశ్వంభర, ఢిల్లీ :  సుస్థిర, పర్యావరణహిత ప్రజారవాణా వ్యవస్థ అభివృద్ధి లక్ష్యంగా ఢిల్లీలో నిర్వహించిన రెండు రోజుల యూఐటీపీ ఇండియా బస్ కాన్ఫరెన్స్–2026 విజయవంతంగా ముగిసింది. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో కన్వీనర్ హోదాలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి సంస్థలో చేపడుతున్న ఆధునిక సంస్కరణలు, ఎలక్ట్రిక్ బస్సుల విస్తరణ, డిజిటల్ సేవలు, ప్రయాణికులకు అందిస్తున్న సౌకర్యాలు, నిర్వహణ సామర్థ్య పెంపు, సంస్థ ఆర్థిక బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. దేశంలో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, డిజిటల్ చెల్లింపులు, స్మార్ట్ మొబిలిటీ, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత రవాణా నిర్వహణ, నెట్‌-జీరో కార్బన్ ఉద్గారాల లక్ష్యాలు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు, ఎంఏఏఎస్ 2.0 సేవలు, గ్రీన్ బాండ్లు, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో నిధుల సమీకరణ, ప్రకటనలు, డేటా మోనిటైజేషన్ ద్వారా అదనపు ఆదాయ వనరులపై సదస్సులో విస్తృతంగా చర్చించారు. అలాగే డ్రైవర్ రహిత అటానమస్ షటిల్స్, అర్బన్ ఎయిర్ మొబిలిటీ వంటి భవిష్యత్ రవాణా సాంకేతికతలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు సమర్థవంతమైన ప్రజారవాణా కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థల మధ్య సమన్వయం అవసరమని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో వివిధ రాష్ట్రాల ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్లు, అంతర్జాతీయ ప్రతినిధులు, రవాణా రంగ నిపుణులు, పరిశ్రమల ప్రతినిధులు, స్టార్టప్ సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు.

🕒 08 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/tgs-rtc-talent-on-the-global-stage/article-21121

Tags:  

Advertisement

LatestNews

గుడుంబా,మద్యం వ్యాపారి నెటుల శోభారాణిపై పీడీ యాక్ట్. 
అవినీతి చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తా. - మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు 
మంత్రి కోమటిరెడ్డి చేతులమీదుగా  గద్దర్ డాక్యుమెంటరీ చిత్ర పోస్టర్ ఆవిష్కరణ. 
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జిహెచ్ఎంసి అధికారి ప్రభావతి.
మంత్రి సీతక్కను కలిసిన పద్మశాలి, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ల చైర్మన్లు
శ్రీ చైతన్యలో పుస్తకాల దందా.. 1వ తరగతి చిన్నారికి మెటా యాప్ పేరుతో వేల రూపాయల దోపిడీ..
ఇయర్‌ఫోన్స్‌లో ఏకంగా 8 మైక్రోఫోన్లా? ఫీచర్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే