ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
విశ్వంభర, హైదరాబాదు : ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు విద్యాసంస్థల ఎదుట భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జీఓ–25ను సవరించి ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని, 50 మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలని, సర్వీస్ నిబంధనలు విడుదల చేసి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, పెండింగ్ డీఏ బకాయిలు విడుదల చేసి 2023 జూలై 1 నుంచి పీఆర్సీ అమలు చేయాలని, జీఓ–317 బాధితులు, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, కేజీబీవీ, మోడల్ స్కూల్, గురుకుల, గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమంలో పాల్గొన్న ఉపాధ్యాయులను యూఎస్‌పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ అభినందిస్తూ, ఆగస్టు 12, 13 తేదీల్లో మండల కేంద్రాల్లో నిర్వహించే తదుపరి నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.