మానుకోట మత్స్యశాఖ అధికారి సస్పెన్షన్..?
విశ్వంభర, మహబూబాబాద్ : మహబూబాబాద్ (మానుకోట) జిల్లా మత్స్యశాఖ అధికారి భాస్కర్‌పై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసినట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా ఆయనపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో రాష్ట్ర ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. విచారణలో ప్రాథమికంగా ఆరోపణలకు సంబంధించిన అంశాలు వెలుగులోకి రావడంతో ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ రాష్ట్ర మత్స్యశాఖ డైరెక్టర్ నిఖిల ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. భాస్కర్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశముందని సమాచారం. ఈ పరిణామం జిల్లా మత్స్యశాఖలో చర్చనీయాంశంగా మారింది.