హన్మకొండ ఎక్సైజ్ కాలనీలోని రామన్ హై స్కూల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.

హన్మకొండ ఎక్సైజ్ కాలనీలోని రామన్ హై స్కూల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.

విశ్వంభర హనుమకొండ జిల్లా :- హన్మకొండ ఎక్సైజ్ కాలనీ రామన్ హైస్కూల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఈ వేడుకలలో విద్యార్థులు విద్యార్థినీలు ఉపాధ్యాయులను పూలమాల, శాలువలతో సత్కరించారు అనంతరం కరస్పాండెంట్ రాజేష్ కుమార్ డైరెక్టర్ పురుషోత్తం మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 5వ తారీఖున డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం మా పాఠశాలలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన విద్యార్థులలో సృజనాత్మకమైన భావం ఏర్పడుతుందని అన్నారు పుస్తకాల్లోని పాఠాలతో పాటు జీవిత పాఠాలు నేర్పేవారు సద్గురువులు .దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మితమవుతే ఆ నిర్మాతలు గురువులేనని కొనియాడారు.ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివని అన్నారు.ఉపాధ్యాయులు వారి జీవితాలను విద్యార్థుల భవిష్యత్ కోసం త్యాగం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Tags: