సరూర్ నగర్ సబ్ రిజిస్టార్ గా బాధ్యతలు చేపట్టిన భూదాల సందీప్.

సరూర్ నగర్ సబ్ రిజిస్టార్ గా బాధ్యతలు చేపట్టిన భూదాల సందీప్.


విశ్వంభర, సరూర్ నగర్:-సరూర్ నగర్ సబ్ రిజిస్టార్ గా భూదాల సందీప్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. మేడ్చల్ డిస్ట్రిక్ట్ కార్యాలయం నుండి బదిలీల్లో భాగంగా సరూర్ నగర్ కు వచ్చారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్లాట్ బుకింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిబ్బంది కూడా ప్రజలతో మర్యాదగా వ్యవహరించి సేవల్లో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు.

Tags: