తొర్రూరులో ఎరువుల దుకాణాల తనిఖీలు

తొర్రూరులో ఎరువుల దుకాణాల తనిఖీలు

  • పారాక్వాట్ గడ్డి మందుల విక్రయిస్తే కఠిన చర్యలు: అధికారుల హెచ్చరిక

విశ్వంభర, తొర్రూరు : పట్టణంలోని ఎరువులు, పురుగుమందుల విక్రయ దుకాణాల్లో వ్యవసాయ అధికారి (ఏఓ) రామ్ నర్సయ్య, ఎస్సై మహేందర్ రెడ్డి శుక్రవారం సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణాల లైసెన్సులు, స్టాక్ రిజిస్టర్లు, మందుల నిల్వలు, విక్రయ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిషేధిత లేదా నిబంధనలకు విరుద్ధంగా పారాక్వాట్ గడ్డి మందులను విక్రయించినట్లు గుర్తిస్తే సంబంధిత దుకాణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, రైతులకు అనుమతించబడిన నాణ్యమైన ఎరువులు, పురుగుమందులనే విక్రయించాలని సూచించారు. వ్యవసాయ రంగంలో నిబంధనల అమలుపై రాజీ ఉండదని, తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

🕒 08 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/inspections-of-fertilizer-shops-in-thorrur/article-21141

Tags:  

Advertisement

LatestNews

శ్రీ చైతన్యలో పుస్తకాల దందా.. 1వ తరగతి చిన్నారికి మెటా యాప్ పేరుతో వేల రూపాయల దోపిడీ..
ఇయర్‌ఫోన్స్‌లో ఏకంగా 8 మైక్రోఫోన్లా? ఫీచర్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే
అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక తనిఖీ
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి