ఘనంగా పీపుల్స్ ప్లాజా లో జాతీయ చేనేత దినోత్సవం
విశ్వంభర, హైదరాబాద్ :- జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత & జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత పురస్కార గ్రహీతలను ఆయన ఘనంగా సత్కరించడమే కాకుండా, ఆగస్టు 7 నుండి 16 వరకు కొనసాగే 100కు పైగా చేనేత స్టాల్స్ ప్రదర్శనను ప్రారంభించారు.దేశానికి అన్నం పెట్టే రైతన్నకు, వస్త్రం అందించే నేతన్నకు ఒకేసారి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. చేనేత కళ మన భారతీయ సంస్కృతి, సంప్రదాయం, వారసత్వానికి ప్రతీక అని, గద్వాల, పోచంపల్లి, నారాయణపేట, సిద్దిపేట వంటి ప్రపంచప్రసిద్ధి చెందిన ఉత్పత్తులతో తెలంగాణ చేనేత రంగం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.చేనేత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రజా ప్రభుత్వం జియో ట్యాగింగ్, IIHT శిక్షణ, నేతన్న పొదుపు పథకం, రూ. 5 లక్షల 'నేతన్నకు భద్రత' బీమా, రూ. 49.27 కోట్ల రుణమాఫీ, మరియు 'నేతన్న భరోసా' ద్వారా వార్షిక ఆర్థిక సాయం వంటి పథకాలను అమలు చేస్తోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి దనసరి అనసూయ (సీతక్క) , ఇతర ఉన్నతాధికారులు మరియు చేనేత కార్పొరేషన్ చైర్మన్ దూడెం వెంకటరమణ , వైస్ చైర్మన్ జక్కని అనిత చేనేత ప్రముఖులు పాల్గొన్నారు.