దగ్గరుండి భర్తకు మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు

ఎక్కడైనా భర్త వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకుంటేనే భార్యలు రగిలిపోతారు. అలాంటిది భర్త వేరే పెళ్లి చేసుకోవాలని చూస్తే.. ఇక సునామీనే. ఇది మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఓ ఇద్దరు భార్యలు మాత్రం దగ్గరుండి మరీ తమ భర్తకు మూడో పెళ్లి చేశారు. ఈ ఘటన అల్లూరి జిల్లా ఏజెన్సీలోని పెదబయలు మండలం గుల్లెలు పంచాయతీ కించూరు గ్రామంలో జరిగింది. 

Read More అనంతపురం కరువుపై సీపీఐ పోరుబాట.. ఆగస్టు 17న కలెక్టరేట్ ముట్టడి

గ్రామానికి చెందిన పండన్న అనే వ్యక్తికి పార్వతమ్మతో మొదటి వివాహం జరిగింది. అయితే, పిల్లలు పుట్టలేదని అతను అప్పలమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి 2007లో ఓ బాబు పుట్టాడు. ఇలా ఇద్దరు భార్యలతో జీవనం సాగిస్తుండగా అతనికి రెండో సంతానం కావాలనుకున్నారు. ఈ క్రమంలోనే మాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీ బందవీధికి చెందిన లక్ష్మిని ఇష్టపడ్డాడు. 

ఈ విషయం భార్యలకు చెప్పగా.. వారు కూడా మూడో పెళ్లికి ఒప్పుకున్నారు. వారే స్వయంగా అమ్మాయి ఇంటికి వెళ్లి ఒప్పించారు. పెద్దలు అంగీకరించడంతో లక్ష్మిని పండన్నకు ఇచ్చి ఆ ఇద్దరు భార్యలే దగ్గరుండి వివాహం జరిపించారు. పెళ్లి పెద్దలు కూడా వారే అయ్యారు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారిపోయింది.

🕒 30 Jun 2024 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/two-wives-who-have-married-their-husband-for-the-third/article-2505

Related Posts

Advertisement

LatestNews

అర్చకుడు కాదు.. కీచకుడు! గుడిలో మైనర్ బాలికపై లైంగిక దాడి
డెలివరీ చార్జీల పేరుతో అదనపు వసూళ్లు.. హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీపై ఆరోపణలు
వీకెండ్ కావడంతో శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. గంటల తరబడి ట్రాఫిక్‌లోనే
పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం.. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు పయనం
దుబాయ్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. త్రివర్ణ కాంతుల్లో బుర్జ్ ఖలీఫా
చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలి. -శ్రీ దేవ భావన ఋషి చేనేత సహకార సంఘం
అర్ధరాత్రి దిగొచ్చిన సీఐ.. బహిరంగ క్షమాపణతో ముగిసిన న్యాయవాదుల వివాదం