సెప్టెంబర్ 29 నాడు చేనేత కార్మికుల నిరసన దీక్ష. - రాపోలు ప్రభాకర్
చేనేత రుణమాఫీ పై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం .
On
విశ్వంభర, చండూర్ : చేనేత రుణమాఫీ కాగితాలకే పరిమితమైందని , చేనేత పరిశ్రమపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని చేనేత పరిరక్షణ సేవా సమితి ఫౌండర్ చైర్మన్ రాపోలు ప్రభాకర్ మండి పడ్డారు. సంవత్సరం క్రితం రుణమాఫీ పై సీఎం చేసిన ప్రకటన నేటి వరకు ఆచరణ కాలేదని, నోటి మాటకే పరిమితం చేసి చేనేత కార్మికుల జీవితాలతో ఆటలాడుతున్నారని అన్నారు. శనివారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ని పురస్కరించుకొని వారికి నివాళులు అర్పించిన తరవాత చేనేత కార్మికుల నిరసనను తెలియజేస్తామని అన్నారు. సెప్టెంబర్ 29 సోమవారం నాడు కార్మికులంతా రోడ్డుపై పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. మరో పక్క కేంద్రం చీరల పైన జిఎస్టి విధించారు. ఇకనైనా కార్మికులారా మేలుకోండి అంటూ పేర్కొన్నారు.



