రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపిన కొదుమూరి దయాకర్ రావు
విశ్వంభర, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ రెండు సంవత్సరాల పదవీకాలం పూర్తిచేసుకున్న సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ కార్యదర్శి,ఐ ఎన్ టి యు సి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొదుమూరి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి, కెవిపి రామచంద్రరావు కలిసి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలో నడిపించారో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మహేష్ కుమార్ గౌడ్ జోడి అదే రీతిలో పరిపాలిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు తెలంగాణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డులు ఇవ్వడం, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం, మహాలక్ష్మి, గృహజ్యోతి వంటి పధకాలు విజయవంతంగా అమలు చెయ్యడం మరిన్ని సంక్షేమ పధకాలు అమలు దిశగా అడుగులు వేస్తున్న జోడికి రాబోవు రోజుల్లో అనేక విజయాలు పొందడం కాయమని అన్నారు.



