సర్ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి
- :ఎమ్మెల్యే బాలు నాయక్
విశ్వంభర, చింతపల్లి: సర్ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ బుధవారం చింతపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని గోడుకొండ్ల , సాయిరెడ్డిగూడెం, కుర్మపల్లి, ఘడియగౌరారం, చింతపల్లి, బాలాజీతండా, గ్రామాలను సందర్శించి సర్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. బూత్‌ల వారీగా నమోదవుతున్న పురోగతిని తెలుసుకుని బీఎల్ఓలు, బీఎల్ఏలకు పలు సూచనలు చేశారు. ఇప్పటికే 100 శాతం సర్ ప్రక్రియ పూర్తి చేసిన బూతుల బీఎల్ఓలు, బీఎల్ఏలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. అదే స్ఫూర్తితో మిగిలిన బూతుల్లోనూ వంద శాతం నమోదు పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి అత్యంత విలువైన హక్కు అని పేర్కొన్నారు. ఒక్క అర్హుడైన ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా ప్రతి ఇంటిని సందర్శించి వివరాలను ధృవీకరించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా పేదలు, గిరిజనులు, మహిళలు, యువత, వృద్ధులు వంటి ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, అందుకోసం ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా బీఎల్ఓలు, బీఎల్ఏలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సర్ విధివిధానాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించిన ఎమ్మెల్యే, దరఖాస్తుల పరిశీలన, అవసరమైన పత్రాల సేకరణ, ఇంటింటి ధృవీకరణ వంటి ప్రక్రియలను నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి బూతులో 100 శాతం సర్ నమోదు పూర్తయ్యేలా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు,ప్రభుత్వ అధికారులు,బీఎల్ఏలు, బీఎల్ఓలు, పార్టీ కార్యకర్తలు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.