పల్లె పహాడ్ లో సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యల చిత్ర పటాలకు పాలాభిషేకం

WhatsApp Image 2024-07-20 at 15.55.51_c857f884

 విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 20 : -ఏక కాలంలో రైతు రుణ మాఫీ చేసిన సిఎం రేవంత్ రెడ్డికి మరియు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకి తాజా మాజీ సర్పంచ్ సుబ్బూరు వెంకటేశ్వర్లుతో కలిసి పాలాభిషేకం చేసిన ఓబీసీ మండల అధ్యక్షులు బత్తిని ఉప్పలయ్య గౌడ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్ రైతు డిక్లరేషన్ సమావేశంలో భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఏక కాలంలో 2 లక్షల పంట  రుణ మాఫీ చేసిన సిఎం రేవంత్ రెడ్డికి మరియు నియోజకవర్గ ప్రజలకు అండగా నిలిచే బడుగు బలహీనవర్గాల నాయకుడు ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్యకు కృతజ్ఞతగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పల్లె పహాడ్ గ్రామంలో వారి చిత్ర పటాలకు  పాలాభిషేకం చేయడం జరిగింది

Read More వరంగల్ క్లబ్ లో  ఆల్ ఇండియా టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభించిన:ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ