భైరవపాలెం మొగలో ప్రమాదం.. గాలివేగానికి సముద్రంలో మునిగిన బోటు

భైరవపాలెం మొగలో ప్రమాదం.. గాలివేగానికి సముద్రంలో మునిగిన బోటు

  • కోనసీమలో సముద్ర ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మత్స్యకారులు

Konaseema News: కోనసీమ జిల్లా భైరవపాలెం మొగ వద్ద మత్స్యకారుల బోటు సముద్రంలో మునిగిపోయింది. గ్రామానికి చెందిన చింత శ్రీనుకు చెందిన బోటులో తొమ్మిది మంది మత్స్యకారులు వేటకు వెళ్లారు. సముద్రంలో వేట కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా గాలి వేగం పెరగడంతో బోటు ప్రమాదవశాత్తు అదుపుతప్పినట్లు సమాచారం. దీంతో బోటులోకి నీరు చేరి సముద్రంలో మునిగిపోయింది. బోటు మునిగిపోవడంతో అందులో ఉన్న తొమ్మిది మంది మత్స్యకారులు ఆందోళనకు గురయ్యారు. అయితే సమీపంలో ఉన్న మరో బోటు సిబ్బంది స్పందించి వారికి సహాయం అందించారు. మరో బోటు సహాయంతో తొమ్మిది మంది మత్స్యకారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. బోటు మునిగిపోవడంతో మత్స్యకారులు వేటకు ఉపయోగించే సామగ్రిని కోల్పోయినట్లు సమాచారం.

Related Posts