రూ.2,56,000 కు వినాయకుని లడ్డు కైవసం.

రూ.2,56,000 కు వినాయకుని లడ్డు కైవసం.

విశ్వంభర,ఇనుగుర్తి: మానుకోట జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన  నాళ్ళ మురళి దంపతులు హైదరాబాదులోని అమూల్య హైట్స్ ఈసీఐఎల్ కుషాయిగూడ అపార్ట్మెంట్ లోని గణపతి లడ్డు వేలం పాటలో పాల్గొని రూ. 2 లక్షల 56 వేలకు దక్కించుకున్నారు.ఈ సందర్భంగా మురళిని సంబంధిత గణపతి ఉత్సవ కమిటీ వారు శాలువాలు,పూలుమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం స్వామివారి దివ్య ప్రసాదమైన లడ్డును మురళీ దంపతులకు అందజేశారు.ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ.. దేవతలచే పూజలందుకునే లంబోతురుని లడ్డు వేలం పాటలో పాల్గొనడం తమ అదృష్టమని,స్వామివారి మహిమాన్విత ప్రసాదాన్ని దక్కించుకోవడం పూర్వజన్మ సుకృతమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు నిన్ను గుర్తి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.

Tags: