గడువు ముగిసిన సిరప్‌ ఇచ్చిన ప్రభుత్వ ఫార్మసీ 

  • మహబూబాబాద్ లో ఘటన..సిబ్బందితో వాగ్వాదం

విశ్వంభర, మహబూబాబాద్ : మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ చిన్నారికి గడువు ముగిసిన సిరప్‌ను అందించడంతో బాలుడి తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరానగర్ కాలనీకి చెందిన మురళీ తన నాలుగేళ్ల కుమారుడు ఎనోస్ రాజ్‌ను వాంతులు, విరోచనాలతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు చిన్నారిని పరీక్షించి రెండు రకాల సిరప్‌లు సూచించారు. అందులో ఒక సిరప్‌ను ఆసుపత్రి ఫార్మసీ నుంచి అందజేయగా, మరో సిరప్‌ను బయట నుంచి కొనుగోలు చేయాలని సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటికి వెళ్లిన తర్వాత ఆసుపత్రి నుంచి ఇచ్చిన సిరప్‌ను బాలుడికి వేయబోతుండగా, దాని గడువు 2026 జూన్ నెలలోనే ముగిసినట్లు తండ్రి గుర్తించాడు. దీంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లి సిబ్బందిని నిలదీశాడు. ఈ సందర్భంగా సిబ్బందికి, బాలుడి తండ్రికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. "గడువు ముగిసిన మందు ఇస్తే పిల్లాడు చావాలా..?" అంటూ తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

🕒 08 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/expired-syrup-given-by-government-pharmacy/article-21131

Tags:  

Advertisement

LatestNews

గుడుంబా,మద్యం వ్యాపారి నెటుల శోభారాణిపై పీడీ యాక్ట్. 
అవినీతి చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తా. - మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు 
మంత్రి కోమటిరెడ్డి చేతులమీదుగా  గద్దర్ డాక్యుమెంటరీ చిత్ర పోస్టర్ ఆవిష్కరణ. 
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జిహెచ్ఎంసి అధికారి ప్రభావతి.
మంత్రి సీతక్కను కలిసిన పద్మశాలి, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ల చైర్మన్లు
శ్రీ చైతన్యలో పుస్తకాల దందా.. 1వ తరగతి చిన్నారికి మెటా యాప్ పేరుతో వేల రూపాయల దోపిడీ..
ఇయర్‌ఫోన్స్‌లో ఏకంగా 8 మైక్రోఫోన్లా? ఫీచర్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే