వరద బాధితులకు భద్రాచలం దేవస్థానం అన్న ప్రసాదం పంపిణి  

వరద బాధితులకు భద్రాచలం దేవస్థానం అన్న ప్రసాదం పంపిణి  

శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి దేవస్థానం  ఈఓ ఎల్ రమాదేవికి  అభినందనలు 

విశ్వంభర,భద్రాద్రి కొత్తగూడెం : ఖమ్మం వరద బాధితుల సహాయార్థం భద్రాచలంలోని  శ్రీ సీతా రామ చంద్ర స్వామి వారి దేవస్థానం  నుండి  5000 ఫుడ్ పాకెట్స్ ను  దేవస్థాన అధికారులు తయారు చేయించారు. ప్రత్యేకంగా అన్నదాన సత్రంలో వంద మంది రామ భక్తుల చేత అన్న ప్రసాదాన్ని ప్యాకింగ్ చేయించి  ఖమ్మం కు తరలించారు. ఖమ్మం నందు రామలీల ఫంక్షన్ హాలు,రామాయణం పేట నందు వరద బాధితులకు వితరణ చేయడం జరుగుతుందని ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎల్ రమాదేవి తెలిపారు. వరదలతో సర్వస్వం కోల్పోయి అనేక ఇబ్బందులు పడుతున్న వరద బాధితుల కోసం భద్రాద్రి ఆలయం తరఫున ఈ చిన్న సహాయం అందించేందుకు ఆలయ అధికారులు ముందుకు వచ్చినట్లు ఈవో తెలిపారు.

 

Read More మౌనం కూడా నేరమని చాటిన ఇటలీ కార్మిక వర్గం. - నేహా ఉమైమ -  AIPSO 

 

 

Tags: