ప్రభాస్ ‘కల్కి ఏడీ 2898‘ ఫస్ట్ సింగిల్ విడుదల
- ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్
- ‘భైరవ యాంథెమ్’ ఫుల్ వీడియో విడుదల
- ఈనెల 27న థియేటర్లలో సందడి చేయనున్న సినిమా
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘కల్కి ఏడీ 2898’. ప్రభాస్తోపాటు దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను ఈనెల 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేశారు.
ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్‌ను విడుదల చేయగా యూట్యూబ్‌లో ఆ రెండు వీడియోలు మిలియన్ వ్యూస్‌తో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాలోని ఓ పాటను విడుదల చేశారు. ఫస్ట్ సింగిల్ ‘భైరవ యాంథెమ్’ ఫుల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాటను ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్లిత్ దోసంత్ పాడారు. సంతోశ్ నారాయణన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం మ్యూజిక్ రైట్స్‌ను ప్రముఖ మ్యూజిక్ లెబెల్ అయిన సరిగమ సొంతం చేసుకుంది.