అలుగు పోస్తున్న జానకమ్మ చెరువు
On
విశ్వంభర, సంస్థాన్ నారాయణపురం :- మండల కేంద్రంలో రాచకొండ గుట్టలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. నారాయణపురం లో గల జానకమ్మ చెరువు గత ఐదు సంవత్సరాల కాలం నుండి ఎండిన చెరువు నేడు మళ్ళీ చెరువు నిండి అలుగు పోస్తుండడంతో రైతులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. చెరువు నిండి అలుగు పోస్తుండడంతో చుట్టుపక్కల నుండి ప్రజలు పెద్ద ఎత్తున చూడడానికి వస్తున్నారు.



