బేల్ పత్రి యూత్ అసోసియేషన్  ఆధ్వర్యంలో అన్నదాన వితరణ 

బేల్ పత్రి యూత్ అసోసియేషన్  ఆధ్వర్యంలో అన్నదాన వితరణ 

 విశ్వంభర, ఛత్రినాక :- బేల్ పత్రి యూత్ అసోసియేషన్ శివగంగా నగర్ చిత్రినాక ఆధ్వర్యంలో అన్నదాన వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కీసరగుట్ట ఆశ్రమానికి చెందిన శ్రీశ్రీశ్రీ దుర్గానంద స్వామీజీ పాల్గొని పూజల అనంతరం అన్నదానాన్ని స్వీకరించారు. ముఖ్య అతిథులుగా ఆలె భాగ్యలక్ష్మి, చంద్రాయన గుట్ట ఇన్చార్జ్   బీజేపీ కౌడి మహేందర్, చంద్రాయన గుట్ట కన్వీనర్ విజయ్ కుమార్, జంగం మెట్ డివిజన్ ప్రెసిడెంట్ ఏ ప్రభాకర్, పాల్గొన్నారు అని కాపర్తి శ్రీనివాస్ తెలిపారు. గత 12 సంవత్సరాలుగా గణేశుని నెలకొల్పుతున్నామని, మహాగణపతి హోమాలు సాంస్కృతిక కార్యక్రమాలు మా సభ్యులు బస్తివాసులంతా కలిసి కట్టుగా ఉంటూ కార్యక్రమాలని దిగ్విజయవంతంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు

Tags: