తెలంగాణ చేనేత ఐక్య వేదిక ఉపాధ్యక్షుడిగా  చెరుకు మల్లయ్య నియామకం 

తెలంగాణ చేనేత ఐక్య వేదిక ఉపాధ్యక్షుడిగా  చెరుకు మల్లయ్య నియామకం 

విశ్వంభర, హైద్రాబాద్ :- తెలంగాణ చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు రాపోలు వీర మోహన్ తెలంగాణ చేనేత ఐక్య వేదిక  ఉపాధ్యక్షులు గా చెరుకు మల్లయ్య ను  నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసారు. తుర్క యంజాల్ లోని  చేనేత ఐక్య వేదిక ప్రధాన కార్యాలయంలో అధ్యక్షులు రాపోలు వీర మోహన్ చేతుల మీదుగా  చెరుకు మల్లయ్య కు  నియామక పత్రం అందజేశారు. ఈ సందర్బంగా మల్లయ్య  మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద భాద్యతను అప్పగించిన రాష్ట్ర కమిటీకి , అధ్యక్షులు కు ధన్యవాదాలు తెలిపారు. చేనేత సమస్యల పై నిరంతరం కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి జెల్ల రఘు, ఉపాధ్యక్షులు జెల్ల పర్వతాలు , ఉపాధ్యక్షులు వనం చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు

Tags: