చేనేత కార్మికులకు అండగా ఉంటా - కమర్తపు మురళి, ప్రెసిడెంట్ - తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం పుట్టపాక లో నేతన్న యాత్ర
On
విశ్వంభర, యాదాద్రి జిల్లా (పుట్టపాక) ప్రతినిధి ఆగస్టు 24 :- అఖిలభారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేతన్న యాత్రకు అనూహ్య స్పందన లభించింది. అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం చేనేత జాతీయ ఇంచార్జ్ బొల్ల శివశంకర్, నేతృత్వంలో పుట్టపాక అంబేద్కర్ చౌరస్తా నుండి , పద్మశాలి చేనేత భవనం వరకు పద్మశాలి చేనేత ర్యాలీ నిర్వహించి, పద్మశాలీల ఐక్యత ను చాటుకున్నారు... ఈ సందర్భంగా చేనేత విభాగంలో జాతీయ అవార్డులు అందుకున్న చేనేత కార్మికులను ఘనంగా సన్మానించి సత్కరించారు. అలాగే చేనేత వస్త్రాలను ధరించి మహిళల చేత చేనేత ఫాషన్ షో చేయించారు. ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళి మాట్లాడుతూ పద్మశాలి చేనేతలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో వినూత్న పథకాలు అమలు చేస్తున్నదని, పేర్కొన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, చేనేత శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రత్యేక చొరవతో,చేనేత కార్మికుల జీవనోపాధికి, నేతన్న భరోసా, చేనేత భీమా, నేతన్న పొదుపు, త్రీప్టు పథకలతో పాటు.. ఎన్నో పథకాలు చేనేతల కోసం ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని, మార్చి నెలలో పద్మశాలీల ఐక్యత సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం ఏర్పాటు చేసి, చేనేత కార్మికులకు 33 కోట్ల రుణమాఫీని, చేయించిన ఘనత, పద్మశాలి సంఘానికి దక్కిందని ఆయన పేర్కొన్నారు, 680 కోట్లతో రాష్ట్రంలోని 63లక్షల డ్వాక్రా మహిళలకు ఒక కోటి 28 లక్షలు చీరలు. పంపిణీలో భాగంగా (రెండు చీరల), 8 కోట్ల మీటర్లు సిరిసిల్ల పద్మశాలి చేనేతల తయారీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని ఆయన పేర్కొన్నారు, రాష్ట్రంలోని పద్మశాలీల సంక్షేమ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు, రాష్ట్రంలో 15 లక్షలు ఉన్న చేనేత పద్మశాలి లకు రానున్న స్థానిక సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు,, చేనేతల సంక్షేమం వారి అభివృద్ధి కోసం, చేనేత కార్మికుల లబ్ధి కోసం, రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసే విధంగా పాటుపడుతున్నామని ఆయన పేర్కొన్నారు..



