మాలల వాటా మాలలకు దక్కాలి 

WhatsApp Image 2024-08-03 at 19.04.33 విశ్వంభర, ఎల్బీనగర్ :  జనాభా లెక్కలు చేసి ఎవరి వాటా ఎంతో  ప్రభుత్వమే చేయాలంటూ, మాల మాదిగలను విడదీయడానికి  కొంతమంది ప్రయత్నిస్తున్నారంటూ, మాలలు మీద అగ్రవర్ణాలు దాడి చేస్తున్నాయి అని  శాసనమండలిలో జరిగిన చర్చల్లో గోరేటి వెంకన్న ప్రసంగిస్తూ ఎస్సీ వర్గీకరణ భారత పార్లమెంట్ ద్వారా జరగాలని,  ఒకవేళ జరిగిన  రాజ్యాంగం పరిధిలో ఉండాలని  మాలల వాటా మాలలకు దక్కాలి అని అన్నారు. మాలల్లో,మాదిగల్లో ఉపకులాలు అణగారిన  వర్గాలు వారికి కూడా సమాన వాట దక్కాలని అని తెలిపారు. శాసనమండలిలో  మాలల తరఫున మాట్లాడిన గోరేటి వెంకన్న తన ఆవేదనను వెల్లడించారు.అందుకు  ఎల్బీనగర్ నియోజకవర్గం మాల మహానాడు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు చేపూరి,శంకరయ్య, అంబేద్కర్ ఉత్సవాల కమిటీ  చైర్మన్ కొంగరి,నరసింహారావు    జేఏసీ వైస్ చైర్మన్  గద్దె,శ్రీనివాస్, ఎల్బీనగర్ మాల సంఘం ఉపాధ్యక్షులు పెరుమళ్ళ శంకరయ్య, ఎల్బీనగర్ మాల సంఘం ప్రధాన కార్యదర్శి వరిజాల రమేష్, వ్యతిరేక పోరాట సమితి ఆర్ కృష్ణ, ఎల్బీనగర్ మాల మహానాడు అధ్యక్షుడు  చింతపల్లి  కాశీనాథ్,సరూర్నగర్ మాల మహానాడు ప్రధాన కార్యదర్శి పర్శపు శ్రీధర్, మాల సంఘాల అడ్వకేట్  కొలను వాసు దేవరావు, మాల సంఘాల గౌరవ అధ్యక్షులు నీలం కృష్ణ, అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు  చేపూరి రాజు,  ఎస్సీ సెల్ నాయకులు  బుంగ రాజు,  ఎల్బీనగర్ మాల మహానాడు ప్రధాన కార్యదర్శి చేపూరి. నరసింహ, దళిత గ్రాడ్యుయేట్ ఫోరం అనిమల్ల శంకర్, ప్రధాన కార్యదర్శి సంగిశెట్టి నరేష్, మాల మహానాడు ఎల్బీనగర్  ఉపాధ్యక్షులు ఏట సత్యనారాయణ, జాయింట్ సెక్రెటరీ సొల్లు శ్రీనివాస్,  డాక్టర్ గాదరి లింగయ్య, గాదరి ప్రవీణ్ కుమార్, బుంగ జయరాజ్, గుండమల్ల నరేష్, అడ్వకేట్ గాలి అరుణ్ కుమార్, యాట జనార్ధన్, ఈసం అజయ్ కుమార్, మాల మహానాడు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: