ఓటర్ల సవరణ కు గడువు పెంచాలి. - తాటికొండ సీతయ్య , మాజీ ఎంపిపి - బీఆర్ ఎస్ మండల అధ్యక్షులు
విశ్వంభర, తుంగతుర్తి :- గ్రామపంచాయతీ ఓటర్ల సవరణ కు గడువు పెంచాలి. తాత్కాలికంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలి. ఏ గ్రామం లో చూసిన వార్డుల వారి ఓట్లను తప్పుల తడకగా విభజించారని. అవన్నీ సరి చేయడానికి కనీసం 10రోజులైనా ఎన్నికల కమిషన్ గడువు పెంచాలని. ఒక వార్డులో నివాసమున్నఓటరును నివాసం లేని వార్డులో చేర్చారని. భార్య ఒక వార్డులో భర్త ఒక వార్డులో నమోదు చేశారని అన్నారు. తుంగతుర్తి ఎంపిడిఓ కార్యాలయం వద్ద విలేఖరుల తో మాట్లాడుతూ ఉదాహరణ కు తుంగతుర్తి 14వ వార్డులో నివాసం ఉన్న కుటుంబాలను విడదీసి భర్త పేరు 14లో ఉంచి భార్య పేరు 9వ వార్డులో చేర్చారని, ఈ విధంగా మండలం లోని పలు గ్రామాలఓటర్ల జాబితాలో తప్పులు దొర్లినాయని అన్నారు. ఇంకా చనిపోయిన వారి పేర్లు. అక్కడక్కడా డబల్ పేర్లు నమోదు అయినాయని. ఇవన్ని సమగ్రంగా సరిచేయాలంటే గడువు కనీసం 10రోజులైనా పెంచాలని అన్నారు. ప్రభుత్వం ఇన్నాళ్లు లేని తొందరలో ఇప్పుడు ఒక ప్రక్క 10జిల్లాల్లో అతి వృష్టి వల్ల. ప్రాణ నష్టం. ఆస్తి నష్టం.. పంటల నష్టం జరిగిప్రజలు ఇబ్బందుల్లో ఉంటేమరో పక్క వరి నాట్లు వేసుకొని యూరియా దొరక్క దుకానాలముందు పడి గాపులు పడుతుంటే పట్టించుకోకుండా.. ఆదర. బాదరగా ఎన్నికలు జరపాలని చూడడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సరియైంది కాదని. తాత్కాలికంగా ఎన్నికలు వాయిదా వేసి. ఓటర్ల జాబితా సవరణ కు గడువు పెంచాలని డిమాండ్ చేశారు.. వారివెంట జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్ పాల్గొన్నారు



