మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
On
విశ్వంభర, గుండాల : గుండాల మండలం మరిపడిగ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన గూడపు పరుశురాములుమృతి చెందడంతో ఆయన కుటుంబానికి ఆలేరు మాజీ శాసనసభ్యులు బూడిద బిక్షమయ్యగౌడ్ 5000 రూపాయలు ఆర్థిక సహాయం గ్రామ శాఖ అధ్యక్షులు అనంతల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చొప్పరి సోమయ్య , మాజీ ఉప సర్పంచ్ తోటకూరి శ్రీనివాస్, సీనియర్ నాయకులు గోల్కొండ బిక్షపతి, గూడెపు రవి, పానుగంటి నాగరాజు బి ఆర్ ఎస్ వార్డు సభ్యులు బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు మాజీ ప్రజాప్రతిథులు పాల్గొన్నారు.



