నేడు సివిల్స్-2024 ప్రిలిమినరీ పరీక్ష 

నేడు సివిల్స్-2024 ప్రిలిమినరీ పరీక్ష 

  • ఉదయం పేపర్ 1, మధ్యాహ్నం పేపర్ 2
  • 30నిమిషాల ముందే పరీక్షా కేంద్రంలో ఉండాలి
  • రెండు ప్రశ్నపత్రాల్లో నెగెటివ్ మార్కింగ్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్స్-2024 ప్రిలిమినరీ పరీక్ష నేడు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 80 ప్రధాన నగరాల్లో ఈ పరీక్ష జరగనుంది. మొత్తం 1,056 పోస్టులకు 13 లక్షల మందికి పైగా దరఖాస్తు చేశారు. ఉదయం 9.30 నుంచి 11:30గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30గంటల నుంచి 4.30గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుంది. 

పరీక్షను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు పరిశీలకుల బాధ్యతలు అప్పగించారు. మొబైల్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల దుర్వినియోగాన్ని నివారించడానికి ప్రతి కేంద్రంలో జామరు ఏర్పాటు చేస్తారు. OMR షీట్‌లో ప్రశ్నపత్రం సిరీస్, ఇతర సమాచారాన్ని చాలా జాగ్రత్తగా నింపాలని నిపుణులు సూచించారు.

Read More Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికలు..

రెండు ప్రశ్నపత్రాల్లో నెగెటివ్ మార్కింగ్ ఉంది. పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందు సెంటర్ గేట్ మూసివేస్తారు. అభ్యర్థులు సాధారణ గడియారాన్ని పరీక్ష హాలులోకి తీసుకెళ్లవచ్చు. స్మార్ట్ వాచ్ నిషేధించబడింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచించిన పరీక్ష మార్గదర్శకాలను జాగ్రత్తగా చదవాలి. అడ్మిట్ కార్డ్, గుర్తింపు కార్డును దగ్గర ఉంచుకోవాలి.

Tags: