వయనాడ్ ఎంపీ సీటును వదులుకున్న రాహుల్ గాంధీ

వయనాడ్ ఎంపీ సీటును వదులుకున్న రాహుల్ గాంధీ

 

అందరూ అనుకున్నట్టే జరిగింది. రాహుల్ గాంధీ వయనాడ్ ఎంపీ సీటును వదులుకున్నారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయ్ బరేలీ, వయనాడ్ రెండు చోట్లా పోటీ చేసి గెలిచారు. దాంతో ఏదో ఒక సీటును ఆయన వదులుకోవాల్సి ఉంది. ఇన్ని రోజులు దీనిపై ఆయన ఆలోచించారు. 

Read More రాజ‌కీయాల‌కు లోక్ మంథ‌న్ అతీతం::కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కాగా అందరూ అనుకున్నట్టే తన కుటుంబానికి కంచుకోట అయిన రాయ్ బరేలీ నుంచి ఆయన ఎంపీగా కొనసాగబోతున్నారు. వయనాడ్ ఎంపీ సీటును వదులుకుంటున్నట్టు ఆయన మల్లిఖార్జున ఖర్గేకు తెలియజేశారు. ఇక ఈ సీటు నుంచి ఎంపీగా ప్రియాంక గాంధీ పోటీ చేస్తుందని తెలిపారు. వయనాడ్ నియోజకవర్గం కేరళలో ఉంది. 

కాగా 2019 ఎన్నికల్లో అమేథీలో ఓడిపోయిన రాహుల్ గాంధీని.. వయనాడ్ ప్రజలు గెలిపించి లోక్ సభకు పంపించారు. అందుకే ఆ నియోజకవర్గం నుంచి మరోసారి తన కుటుంబ సభ్యులే ఉండాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కమ్యూనిస్టుల కంచుకోటలో మరోసారి గాంధీ కుటుంబం గెలుస్తుందా లేదా అనేది చూడాలి.

Related Posts