రియల్ ఎస్టేట్ లో చాలా మోసాలు జరుగుతున్నాయి : నటుడు జగపతి బాబు
On
విశ్వంభర, హైదరాబాద్ : రియల్ ఎస్టేట్ మోసాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రియల్ ఎస్టే్ట్‌లో భారీగా మోసాలు జరుగుతున్నాయన్నారు. అభిమానులు, సామాన్య ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భూమి కొనేముందు రెరా నిబంధనలు గుర్తించి పూర్తిగా తెలుసుకోని ప్రాపర్టీ కొనాలన్నారు. తనను రియల్ ఎస్టేట్ వ్యాపారులు మోసం చేశారని వాపోయారు.
ఇటీవల ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన యాడ్‌లో నటించా అని చెప్పారు. చెక్కు విషయంలో వాళ్లు మోసం చేశారని తెలిపారు. తనను మోసగించిన వాళ్లు ఎవరు.. అసలు ఏం జరిగింది వంటి విషయాలను త్వరలోనే బయటపెడతా అన్నారు. రియల్ ఎస్టేట్ గురించి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా హెచ్చరించారని జగపతి బాబు గుర్తు చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు.
Tags: Actor Jagapathi Babu