‘దసరా’లో నాని ఇంట్రడక్షన్ సీన్‌ను తలపించేలా హైవే దోపిడీ..!

‘దసరా’లో నాని ఇంట్రడక్షన్ సీన్‌ను తలపించేలా హైవే దోపిడీ..!

దసరా సినిమాలోని ఇంట్రడక్షన్ సీన్‌ను తలపించేలా ఇద్దరు వ్యక్తులు కదులుతున్న ఓ లారీపైకి ఎక్కి దోపిడీ చేశారు. వేగంగా వెళ్తున్న వాహనంలో దోపిడీ చేసి అంతే స్పీడ్‌తో బైక్‌పై జంప్ చేశారు దొంగలు.

టాలీవుడ్ హీరో నాని నటించిన ‘దసరా’ సినిమా అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో నాని ఇంట్రడక్షన్ సీన్‌లో బొగ్గు లారీ నుంచి నాని, అతడి ఫ్రెండ్స్ దోపిడీ చేసే సీన్ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. అయితే, అసలు విషయానికి వస్తే.. దసరా సినిమాలోని ఇంట్రడక్షన్ సీన్‌ను తలపించేలా ఇద్దరు వ్యక్తులు కదులుతున్న ఓ లారీపైకి ఎక్కి దోపిడీ చేశారు. 

వేగంగా వెళ్తున్న వాహనంలో దోపిడీ చేసి అంతే స్పీడ్‌తో బైక్‌పై జంప్ చేశారు దొంగలు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన ఆగ్రా-ముంబై హైవేపై జరిగింది. ఆ లారీ దుస్తుల లోడ్‌తో వెళ్తున్నట్లు సమాచారం. హైవేపై లారీ వేగంగా వెళ్తుండగానే వెనుక నుంచి ఓ వ్యక్తి బైక్‌పై ఫాలో అవుతున్నాడు. అప్పటికే లారీ ఎక్కిన ఇద్దరు వ్యక్తులు లారీలోని ఓ డబ్బాను కిందపడేశారు. ఆ తర్వాత లారీ వెనుక వస్తున్న బైక్‌కి చాకచక్యంగా దిగారు.

Read More పూరీ బీచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి సైకత శిల్పం, రేవంత్ బర్త్ డే సందర్భంగా అభిమానాన్ని చాటుకున్న మెట్టు సాయి కుమార్..

Tags:

Related Posts