పారిశుధ్య కార్మికురాలిపై ప్రభుత్వ అధికారి లైంగికదాడి..!

పారిశుధ్య కార్మికురాలిపై ప్రభుత్వ అధికారి లైంగికదాడి..!

గాజుల రామారంలో శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న కిషన్ ఓ మున్సిపల్ కార్మికురాలిపై కన్నేశాడు. చెప్పినట్లు వినకుంటే విధి నిర్వహణలో ఇబ్బందులు పెట్టాడు. రోజూ పనికి వచ్చిన ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు.

ఓ ప్రభుత్వ అధికారి కామంతో కళ్లు మూసుకుపోయి బరితెగించాడు. ఒళ్లు మరిచి పారిశుధ్య కార్మికురాలిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. పైగా వీడియో రికార్డు చేసి బెదిరించి వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి జోనల్ కమిషనరేట్ పరిధి గాజుల రామారంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. 

గాజుల రామారంలో శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న కిషన్ ఓ మున్సిపల్ కార్మికురాలిపై కన్నేశాడు. తాను చెప్పినట్లు వినాలని ఆమెను బెదిరించాడు. చెప్పినట్లు వినకుంటే విధి నిర్వహణలో ఇబ్బందులు పెట్టాడు. రోజూ పనికి వచ్చిన ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. అంతటితో ఆగకుండా ఈ తతంగమంతా తన ఫోన్‌లో రికార్డు చేశాడు. ఈ క్రమంలో కిషన్‌ లైంగిక వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Read More విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారులో చిక్కుకుని డ్రైవర్‌ సజీవ దహనం

తోటి కార్మికుల ఫోన్‌లో కూడా వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. అవన్నీ చూసిన కార్మికులు ఏంటని ప్రశ్నించారు. దీంతో ఎవరికీ చెప్పొద్దంటూ ఒక్కొక్క కార్మికుడికి రూ.10వేల చొప్పున దాదాపు 14మందికి డబ్బులు ఇచ్చి వారి నోరు మూయించాడు కిషన్. కూకట్‌పల్లి మహిళా జోనల్ కమిషనర్ పరిధిలో ఇలాంటి ఘటన జరగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ లైంగిక వేధింపుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా జీహెచ్‌ఎంసీ అధికారులు శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్‌ కిషన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు అంటున్నారు.

Related Posts