ఏపీ మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే.. హోం శాఖ ఆమెకే..!

ఏపీ మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే.. హోం శాఖ ఆమెకే..!

 



ఏపీ మంత్రులకు చంద్రబాబు నాయుడు శాఖలను కేటాయించారు. అందరూ ఊహించినట్టుగానే పవన్ కల్యాణ్‌ కు డిప్యూటీ సీఎం పదవిని కేటాయించారు చంద్రబాబు. దాంతో పాటు ఆయనకు కీలక శాఖలను కేటాయించారు. ఇక చంద్రబాబు తన వద్ద కీలక శాఖలను ఉంచుకున్నారు. అందులో సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు,  జీఏడీ, పబ్లిక్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ వీటితో పాటు మంత్రులకు కేటాయించని శాఖలను తన వద్ద ఉంచుకున్నారు.

ఇక పవన్ కల్యాణ్‌ కు కూడా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, రూరల్ వాటర్ సప్లై, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి కీలక శాఖలను కేటాయించారు. తన కొడుకు నారా లోకేష్ కు గతంలో ఇచ్చిన ఐటీ శాఖతో పాటు మానవ వనరులు, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, ఆర్‌టీజీ శాఖలను ఇచ్చారు. మితా మంత్రులకు ఇచ్చిన శాఖలు ఇలా ఉన్నాయి.

కింజరాపు అచ్చెన్నాయుడు – వ్యవసాయం, సహకారశాఖ, మార్కెటింగ్‌, పశుసంవర్థకశాఖ, డెయిరీ డెవలప్‌మెంట్‌, మత్స్యశాఖ
కొల్లు రవీంద్ర – గనులు అండ్‌ జియాలజీ, ఎక్సైజ్‌
నాదెండ్ల మనోహర్ – ఆహార, పౌర సరఫరాలు; వినియోగదారుల వ్యవహారాలు
పి.నారాయణ –  మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌
వంగలపూడి అనిత –  హోంశాఖ, విపత్తు నిర్వహణ
సత్యకుమార్ యాదవ్ – వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ
నిమ్మల రామానాయుడు  – జలవనరుల అభివృద్ధి శాఖ
ఎన్.ఎమ్.డి.ఫరూక్  – మైనార్టీ, న్యాయశాఖ
ఆనం రామనారాయణరెడ్డి  – దేవాదాయశాఖ
పయ్యావుల కేశవ్ – ఆర్థిక, ప్రణాళిక, కమర్షియల్‌ ట్యాక్సెస్‌, శాసనసభ వ్యవహారాలు
అనగాని సత్యప్రసాద్ –  రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ శాఖ
కొలుసు పార్థసారధి – గృహ నిర్మాణం, సమాచార శాఖ
డోలా బాలవీరాంజనేయస్వామి – సాంఘిక సంక్షేమం, సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్థ
గొట్టిపాటి రవి కుమార్  –  విద్యుత్‌ శాఖ
కందుల దుర్గేష్ – పర్యాటక, సాంస్కృతిక శాఖ, సినిమాటోగ్రఫీ
గుమ్మడి సంధ్యారాణి –  గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ
బీసీ జనార్థన్ రెడ్డి –  రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు
టీజీ భరత్ –   పరిశ్రమలు, వాణిజ్యం
ఎస్.సవిత – బీసీ వెల్ఫేర్, చేనేత సంక్షేమం, జౌళి
వాసంశెట్టి సుభాష్ – కార్మిక శాఖ
కొండపల్లి శ్రీనివాస్ – చిన్న తరహా పరిశ్రమలు, సెర్ప్‌, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు
మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి  – రవాణా, యువజన సర్వీసులు, క్రీడలు

Related Posts