‘దేశాన్ని నాశనం చేయాలంటే ఆటంబాంబులు అవసరం లేదు’
- ఓ యూనివర్సిటీ సందేశాన్ని పంచుకున్న మాజీ జేడీ లక్ష్మినారాయణ
- నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై సంచలన ట్వీట్
నీట్ పేపర్ లీకైనట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి.లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ వేదికగా ఆయన ఓ ట్వీట్ చేశారు. ఓ యూనివర్సిటీ ప్రవేశ ద్వారం వద్ద రాసి ఉన్న సందేశానికి సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. అందులో ‘‘ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఆటంబాంబులు అవసరం లేదు. నాసిరకం విద్య, విద్యార్థులను పరీక్షల్లో కాపీ కొట్టనివ్వడం లాంటి విధానాలను ప్రోత్సహిస్తే ఆ దేశం దానంతటదే నాశనం అవుతుంది. అలా చదివిన డాక్టర్ల చేతిలో రోగుల ప్రాణాలు పోతాయి’’ చనిపోతారు అని రాసివుంది.
ఇదిలా ఉండగా నీట్ అక్రమాలు గుజరాత్, బీహార్ రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. నీట్ యూజీ పరీక్ష నిర్వహణలో అవకతవకలు, ఫలితాల వెల్లడిలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అక్కడ ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వాలే అధికారంలో ఉండటం ప్రస్తుతం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. మరోవైపు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల మాట్లాడుతూ ఎలాంటి అక్రమాలు జరగలేదని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. తాజాగా ఆయన మాటమార్చారు. అక్రమాలు జరిగిన మాట నిజమేనని అంగీకరించడం గమనార్హం.
— V. V. Lakshmi Narayana , A+ (JD) (@VVL_Official) June 17, 2024