ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోండి

మెట్పల్లి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని స్టేట్మెంట్ ఇచ్చిన మునిసిపల్ కమిషనర్ గారికి పట్టణ నడిబొడ్డులో గల మురికి కాలువ కనిపించడం లేదా 

1

14 జులై 2024 విశ్వంభర మెట్పల్లి :-  అసలే వర్షాకాలం ఆపై విష జ్వరాలు డెంగ్యూ వ్యాధి నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తే మెట్పల్లి పట్టణం జాతీయ రహదారి ప్రక్కన గల మురుగు కాలువ నీరు నిలిచి దోమలకు ఇతర కీటకాలకు నిలయంగా మారినవి ప్రభుత్వ దావకాన గేటు పక్కనే గల మురికి కాలువ లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మురుకు కాల్వలో ఉండడం దానికి రక్షణగా ఉన్న కంచ చుట్టూ పిచ్చి మొక్కలు ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎర్తింగ్ వైరు మురుగు కాల్వకు ఆనుకుని ఉండడంతో అనుకోకుండా కాలువలో దిగిన పశువులకు విద్యుత్ షాక్ కొట్టే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మున్సిపల్ అధికారులు మరియు విద్యుత్ శాఖ అధికారులు సమస్యపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుచున్నారు

Read More తన ఓటమిపై ఎర్రబెల్లి కీలక వ్యాఖ్యలు