నెటిజన్లపై గాయని చిన్మయి ఆగ్రహం
ఇటీవల తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ చిన్నారి అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తు నుంచి కిందకు పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదృష్టవశాత్తు ఆ చిన్నారి మరో అంతస్తు అంచున పడి ఆగింది.
ఇటీవల తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ చిన్నారి అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తు నుంచి కిందకు పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదృష్టవశాత్తు ఆ చిన్నారి మరో అంతస్తు అంచున పడి ఆగింది. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు పైకెక్కి చిన్నారిని రక్షించారు. అయితే, వీడియో చూసిన నెటిజన్లు తల్లిదే తప్పు అని తెగ ట్రోల్స్ చేశారు. దీంతో మనస్తాపం చెందిన చిన్నారి తల్లి ఆదివారం ఆత్మహత్య చేసుకుంది.
అయితే, ఈ ఘటనపై గాయని చిన్మయి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. మీ ట్రోలింగ్ కారణంగా ఓ చిన్నారి తల్లి బలవంతంగా ప్రాణాలు తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మీకు సంతోషం కదా... అదే అత్యాచారం చేసే వాళ్లపై ఇంతగా ఎందుకు రియాక్ట్ అవ్వరు అంటూ ప్రశ్నించారు. కారు. టికెట్లు కొనుగోలు చేసి మరీ హత్య, అత్యాచారం చేసే వాళ్ల పర్ఫార్మెన్స్ చూస్తారు.. ఎవరైతే ఆమెను ట్రోల్ చేశారో ఇప్పుడు వాళ్లు వచ్చి ఆ చిన్నారిని చూసుకోండని చిన్మయి నెటిజన్లపై మండిపడ్డారు.
https://www.instagram.com/p/C7KL-EOydP8/?utm_source=ig_embed&ig_rid=80c8a569-4f74-4426-b8ef-e11f86ee02cf