నయీం నగర్‌లో డిజిటల్ ప్రింటింగ్ హబ్ ప్రారంభోత్సవం 

నయీం నగర్‌లో డిజిటల్ ప్రింటింగ్ హబ్ ప్రారంభోత్సవం 

విశ్వంభర, హనుమకొండ: హనుమకొండ నయీం నగర్ శరణ్య హాస్పిటల్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ఐఖ్య డిజిటల్ ప్రింటింగ్ హబ్ ను హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి  ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు, వ్యాపారస్తులకు అత్యాధునిక డిజిటల్ ప్రింటింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన నిర్వాహకులను ఇనగాల అభినందించారు. ఈ హబ్‌లో ఫ్లెక్స్ ప్రింటింగ్, యువీ డిజిటల్ ప్రింటింగ్, బ్యానర్, బుక్ ప్రింటింగ్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ప్రింటింగ్ యజమానులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags: