పాడి కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు మహిళా కాంగ్రెస్ పిర్యాదు
- కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు చీర, గాజులు పంపిస్తానన్న కౌశిక్ రెడ్డి
- కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్ నేతల ఆగ్రహం
- పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
విశ్వంభర,హైదరాబాద్ : బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో వారు స్పీకర్‌ను కలిశారు. ఈసందర్భముగా వారు మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడారని మండిపడ్డారు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందే చెప్పారు .
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు చీర, గాజులు పంపుతున్నానంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నాయకులు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు... మహిళలను కించపరచడం మానుకోవాలని హెచ్చరిస్తున్నారు.
ఈ కార్యక్రమములో తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బండు శోభారాణి , మరియు ఆర్యవైశ్య కార్పోరేషన్ ఛైర్పర్సన్ కాల్వ సుజాత, కాంగ్రెస్ అదికార ప్రతినిది భవాని రెడ్డి,సంధ్యరెడ్డి, పారిజాతం రెడ్డి , వరలక్ష్మి పాల్గొన్నారు