రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ దే హావా - రామేశ్వర్ రెడ్డి

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ దే హావా - రామేశ్వర్ రెడ్డి

విశ్వంభర, మర్పల్లి :- మర్పల్లి మండలం పరిధిలో సిరిపురం గ్రామంలో మండల అధ్యక్షులు రామేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై దేశం చేయడం జరిగింది.  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి  హాజరై వారు మాట్లాడుతూ రాబోయే మరి కొద్ది రోజుల్లో  వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కొరకు పార్టీ సంసిద్ధంగా ఉండాలని సంసిద్ధంగా కార్యకర్తలు సమన్వయంగా పనిచేయాలని అన్ని స్థానాలలో పార్టీ నిలబడాలని వారు కోరారు. ఎన్నికల సమయంలో ఏ విధంగా ముందు ముందుకు వెళ్లాలని విషయాలపై  చర్చించి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల కో ఇన్చార్జ్  రాములు , నాయకులు లక్ష్మన్, బలరాం, నాగన్న,యాదవ్ రెడ్డి, మండలం ప్రధాన కార్యదర్శి శ్రీమంత్ కుమార్,జైపాల్, యదన్న జిల్లా మహిళా నాయకురాలు మహేశ్వరీ, మైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Tags: