రోగులను పట్టి పీడిస్తున్న ప్రవేట్ ఆసుపత్రులు
విషజ్వరాలపై చర్యలు తీసుకోవాలి - ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ డిమాండ్
విశ్వంభర, కరీంనగర్ : ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ఒక్క ప్రకటన విడుదల చేస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య అధికారులకు జిల్లాలో విస్తరిస్తున్న విషజ్వరాలు, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, చికున్‌గున్యా తదితరాలపై అవసరమైన చర్యలు తీసుకోవాలని, డాక్టర్ లను అందుబాటులో ఉంచే విధంగా అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రయివేట్ ఆసుపత్రులకు వస్తున్న రోగుల నుండి ఇస్తానుసారంగా ఫీజులు వాసులు చేస్తున్నారని వీటిపై నియంత్రణ పెట్టాలని కోరారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, చికున్‌గున్యాతో పాటు విషజ్వరాలు రోజురోజుకు పెరుగుతున్నాయనీ అన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో కుటుంబాలకు కుటుంబాలే మంచానపడుతున్నాయి. ముఖ్యంగా గ్రామపంచాయితీల్లో పారిశుద్ధ్యం లోపించడం వల్ల పరిస్తితి ఇంకా తీవ్రంగా మారింది. గత 10 రోజుల నుండి పరిస్ధితి ఆందోళనకరంగా మారుతున్నది. ప్రతి సంవత్సరం సీజనల్ వ్యాధులపై తాత్కాలిక ఉపశమన చర్యలు తీసుకోవడం తప్ప, శాశ్వత పరిష్కారం చూపడం లేదనీ అన్నారు. ప్రభుత్వం అధికారికంగా నమోదైన కేసుల సంఖ్య కంటే వాస్తవంగా చాలా ఎక్కువగా వున్నాయి. డెంగ్యూ, విషజ్వరాల వల్ల అక్కడక్కడా మరణాలు సంభవిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయినీ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైనన్ని మందులు, బెడ్లు, డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్స్, వైద్య పరికరాలు లేవు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి లోనూ హాస్పటల్స్ రోగులతో నిండిపోతున్నాయి. చాలా చోట్ల ప్లేట్‌లెట్స్‌ను నిర్ణయించే పరికరాలు అందుబాటులో లేవు. దీంతో పేద, మధ్య తరగతి రోగులు ప్రయివేటు హాస్పటల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. అవసరంలేని వైద్య పరీక్షలు, బెడ్‌ఛార్జీలు, ఇతర ఛార్జీల పేరుతో రోగులను దోపిడీకి గురిచేస్తున్నారు. ఇలాంటి ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. ప్రజారోగ్యం క్షీణిస్తున్న ప్రస్తుత తరుణంలో తక్షణమే అన్ని గ్రామాలల్లో, ప్రాంతాలు, మొబైల్ టీమ్‌ల ద్వారా వైద్య క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య సహాయం అందించాలనీ కోరారు. అవసరమైతే సంచార వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సౌకర్యాలు అందించాలనీ డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో దోమతెరలను పంపిణీ చేయాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకుని జిల్లా సెంటర్ల వరకు ప్లేట్‌లెట్స్ కౌంట్ మిషన్స్‌తో పాటు, హెల్త్ చెకప్, ఇతర వైద్య పరీక్షల పరికరాలు, మందులు, డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్స్‌తో పాటు, ఇతర స్టాఫ్‌ను సమకూర్చాలి. వీటితో పాటు, ఎమర్జెన్సీ పరికరాలను అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.