పోచంపల్లి నేత బజార్ స్థలం అన్యాక్రాంతం. స్థల వివాదం పై హర్యానా గవర్నర్ కు వినతి

పోచంపల్లి నేత బజార్ స్థలం అన్యాక్రాంతం. స్థల వివాదం పై హర్యానా గవర్నర్ కు వినతి

విశ్వంభర, భూదాన్ పోచంపల్లి : ఆగస్టు 7వ తేదీ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హర్యానా మాజీ గవర్నర్  బండారు  దత్తాత్రేయ  పోచంపల్లికి విచ్చేసి ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ కి నివాళులర్పించారు.  పోచంపల్లి చేనేత సహకార సంఘ భవనంలో స్థానిక చేనేత కళాకారులు చేనేత నాయకులు టై& డై ప్రతినిధులతో సమావేశమై చేనేత దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని చేనేత సమస్యలపై పూర్తిగా వివరణ తీసుకొని పోచంపల్లి గ్రామంలో ఉన్నటువంటి నేత బజార్ సర్వే నెంబర్ 419, 420, 433 లోగల మొత్తం నాలుగు ఎకరాల స్థలం అన్యాక్రాంతమైనది అని  నేత బజార్ విషయం పైన రాష్ట్ర బిజెపి నాయకులు ఎన్నం శివకుమార్ వారి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వారు స్పందిస్తూ ఈ యొక్క సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది. హామీ మేరకు నేత బజారుకు సంబంధించిన పూర్తి సమాచారంతో నేడు  బండారు దత్తాత్రేయ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.   ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత నాయకులు బిక్షపతి, రాష్ట్ర చేనేత జన సమాఖ్య అధ్యక్షులు చింతగింది రమేష్ , బిజెపి చేనేత సెల్ జిల్లా కన్వీనర్ గంజి బసవలింగం,  బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి ఏలే శ్రీనివాస్  పాల్గొనడం జరిగింది. 
 

Tags: