మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు
శుక్రవారం రూ.400 పైగా తగ్గిన బంగారం ధర, నేడు (జూన్ 1) మరోసారి రూ.150తగ్గింది. శనివారం ఉదయం 6.20 గంటల నాటికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.72,600గా ఉండగా, 22 క్యారెట్ల బంగార ధర రూ. 66,540కి చేరుకుంది.
మహిళలకు మళ్లీ గుడ్ న్యూస్ వచ్చేసింది. బంగారం వెండి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. శుక్రవారం రూ.400 పైగా తగ్గిన బంగారం ధర, నేడు (జూన్ 1) మరోసారి రూ.150తగ్గింది. శనివారం ఉదయం 6.20 గంటల నాటికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.72,600గా ఉండగా, 22 క్యారెట్ల బంగార ధర రూ. 66,540కి చేరుకుంది.
ఇక, ప్రధాన నగరాల్లో బంగారం ధరలను చూస్తే.. ఢిల్లీలో 10 గ్రాముల 24క్యారెట్ల పుత్తడి ధర రూ.72,750కి చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,690కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములకు) చెన్నైలో రూ.67,140, ముంబై రూ. 66,540, కోల్‌కతా రూ. 66,540, బెంగళూరు రూ. 66,550, అహ్మదాబాద్‌లో రూ.66,690గా ఉంది.
అదేవిధంగా వెండి ధరలు కూడా కిలోకు వెయ్యి రూపాయలు తగ్గి రూ.95,400కి చేరింది. హైదరాబాద్‌లో కేజీ వెండి రేటు రూ. 99,900కు చేరుకుంది. ఈ క్రమంలో ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 95,400, ముంబైలో రూ. 95,400, చైన్నైలో రూ. 99,900, కోల్‌కతాలో రూ. 95,400, కేరళలో రూ. 99,900, బెంగళూరులో కిలో వెండి ధర రూ. 95,700గా ఉంది.