ఎన్డీయే ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు : మల్లికార్జున్‌ ఖర్గే

ఎన్డీయే ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు : మల్లికార్జున్‌ ఖర్గే

విశ్వంభర,బెంగళూరు : పొరపాటున ఏర్పాటైన ఎన్డీయే ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే ఆరోపించారు. బీజేపీ తన పొత్తులను కొనసాగించడానికి చాలా కష్టపడుతుందని తెలిపారు. శనివారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ‘ఎన్డీయే ప్రభుత్వం అనుకోకుండా ఏర్పడింది. మోడీకి మెజారిటీ లేదు. ఇది మైనారిటీ ప్రభుత్వం. కాబట్టి ఎప్పుడైనా పడిపోవచ్చు. కానీ నేను ఇది కొనసాగాలని కోరుకుంటున్నా’ అని వ్యాఖ్యానించారు. దేశాన్ని బలోపేతం చేయడానికి కలిసి పని చేయాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. దేశాభివృద్ధికి ఎల్లవేళలా సహకరిస్తామని చెప్పారు. బీజేపీ మిత్ర పక్షాలు ఇప్పటికే అసంతృప్తితో ఉన్నాయని, కేంద్ర కేబినెట్ ఏర్పాటు తర్వాత ఈ విషయం స్పష్టంగా అర్థమైందన్నారు.


ఖర్గే వ్యాఖ్యలపై జేడీయూ నేత నీరజ్ కుమార్ స్పందించారు. పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ హయాంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాల పనితీరు గురించి ఖర్గేకు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ1991 సాధారణ ఎన్నికల్లో 244 సీట్లు, 2004లో 114 సీట్లు మాత్రమే గెలుచుకుందని తెలిపారు. కాంగ్రెస్ చరిత్ర గురించి ఖర్గేకు తెలియదా అని ప్రశ్నించారు. మరోవైపు నీరజ్ వ్యాఖ్యలకు ఆర్జేడీ కౌంటర్ ఇచ్చింది. ఖర్గే చెప్పింది నిజమేనని ప్రజలంతా మోడీకి వ్యతిరేకంగానే ఉన్నారని తెలిపారు. ఓటర్లు అంగీకరించకున్నా మోడీ అధికారంలోకి వచ్చాడని ఆర్జేడీ అధికార ప్రతినిధి ఎజాజ్ అహ్మద్ చెప్పారు.

Read More ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్.. షెడ్యూల్ ఇదే!