బాపట్ల జిల్లాలో ఘోరం.. ఈతకు వెళ్లి నలుగురు యువకుల మృతి

బాపట్ల జిల్లాలో ఘోరం.. ఈతకు వెళ్లి నలుగురు యువకుల మృతి

 

ఈ నడుమ ఈతకు వెళ్లి మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సరదా కోసం కొంత మంది ఈతకు వెళ్లి చివరకు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు తాజాగా బాపట్ల జిల్లాలో శుక్రవారం కూడా ఇలాంటి దారుణ ఘనననే వెలుగు చూసింది. నలుగురు యువకులు అర్ధాంతరంగా తమ ప్రాణాలు కోల్పోయారు. 

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

బాపట్ల  జిల్లాలో శుక్రవారం తీవ్ర విషాదం నెలకొంది. సముద్రంలో ఈతకు వెల్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు .వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో స్నానానికి వెళ్లిన నలుగురు అలల ఉద్ధృతికి కొట్టుకుపోయారు. వీరిలో ముగ్గురి మృతదేహాలు తీరానికి కొట్టుకొచ్చాయి.

సమాచారం అందుకున్న పోలీసులు, మిగతా సిబ్బంది నాలుగో  వ్యక్తి మృతదేహం కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. గల్లంతైన నలుగురు యువకులు ఏలూరు జిల్లాకు దుగ్గిరాలకు చెందిన వారే. బీచ్ కు వచ్చేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.