నిరుపేదలకు పెద్ద కొడుకు డా. కోడి శ్రీనివాసులు. - తహశీల్దార్  కె.చంద్రశేఖర్

 గాంధీజీ ఫౌండేషన్ సేవలు అమోఘం

నిరుపేదలకు పెద్ద కొడుకు డా. కోడి శ్రీనివాసులు. -  తహశీల్దార్  కె.చంద్రశేఖర్

  •  నిరుపేదలను ఆదుకోవడంలో డాక్టర్ కోడి శ్రీనివాసులు ఆదర్శం 
  • 21వ నెల నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన గాంధీజీ ఫౌండేషన్ 
  • ఏ ఆసరా లేని నిరుపేదలను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ ఆశయం

విశ్వంభర, చండూర్:-  రెండు సంవత్సరముల వరకు ప్రతినెల 30 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు 2024 జనవరి ఒకటో తేదీన ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్  "నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ" కార్యక్రమం సోమవారం నాడు స్ధానిక గాంధీజీ విద్యాసంస్థల యందు  21 వ నెల పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా చండూరు తాసిల్దారు కె. చంద్రశేఖర్ హాజరై మాట్లాడుతూ సమాజంలో పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఎవరికి సహాయం చేయాలని ఒక స్పష్టతతో 30 మంది సరియైన పేదలను ఎంపిక చేసుకొని వారికి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమని తెలిపారు. సమాజంలో చాలామందికి డబ్బులు ఉంటాయని, దానం చేసే గుణం చాలా తక్కువ మందికి ఉంటుందని, ఏదో ఒక నెల కాకుండా 21 నెలల నుండి ప్రతి నెల ఒకటవ తేదీన 30 మందికి నిత్యవసర సరుకులు పంచడం అభినందనీయమని అన్నారు. పనిచేయడానికి శక్తి లేకుండా కుమారులు, కూతుళ్లు లేని ఒంటరి మహిళలే ఎక్కువ ఉండడం గమనించానని, వీళ్ళందరికీ కోడి శ్రీనివాసులు పెద్ద కొడుకులా వ్యవహరిస్తున్నారని అన్నారు. గాంధీజీ ఫౌండేషన్  చైర్మన్  డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ మా ఫౌండేషన్ 21 నెలలుగా 6,00,000 రూపాయల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద  విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను, వేసవికాలంలో చలివేంద్రాన్ని, చనిపోయిన పేద కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని చేస్తూ వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ఇంచార్జ్ ప్రిన్సిపాల్  పులిపాటి రాధిక, శ్రీజన్, కందుల కృష్ణయ్య,  బుషిపాక యాదగిరి, బోడ విజయ్, గోపి తదితరులు పాల్గొన్నారు.

 

Read More ULC భూములపై రేవంత్‌ సర్కార్‌ తీరును తప్పుబట్టిన హరీశ్‌రావు

 

 

Tags: