ఏక కాలంలో పంట రుణ మాఫీకి కృషి చేస్తున్న సిఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు

 

విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 17 :  - WhatsApp Image 2024-07-17 at 14.23.41_d4e6a776ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అన్నదాతలకు ఇచ్చిన ఏక కాలంలో 2లక్షల  పంట రుణ మాఫీనీ అమలు చేసేందుకు సర్వం సిద్ధం చేసిన  ముఖ్య మంత్రి అనుముల రేవంత్ రెడ్డికి ,  జిల్లా మంత్రి  కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి నియోజక వర్గ ప్రజల గొంతుక అభివృద్ధి ప్రదాత ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యులు  బీర్ల అయిలయ్యకి మరియు క్యాబినెట్ మంత్రులకు , శాసన సభ్యులకు కృతజ్ఞతలు. గత ప్రభుత్వం   ఇచ్చిన హామీలు పదేళ్లు పూర్తి చేయకపోయినా అధికారంలోకి వచ్చి రాగానే తన క్యాబినెట్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలు 6 గ్యారంటీలు, ఏక కాలంలో 2 లక్షల పంట రుణ మాఫీ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, నూతన ఆర్టీసీ బస్సుల కొనుగోలు , గ్రామ పంచాయతీ మల్టి పర్పస్ కార్మికుల పెండింగ్ వేతనాలు, ఉద్యోగుల పదవీ విరమణలు, అంగన్వాడీ టీచర్లకు 2 లక్షల రూపాయలు, ఆయాలకు ఒక లక్ష రూపాయలు ఇచ్చి పదవీ విరమణ ఇవ్వడం, నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల (జాబ్ క్యాలండర్)కు రేయింబవళ్ళు శక్తి వంచన లేకుండా  ప్రజా పాలన చేస్తున్న సిఎం రేవంత్ రెడ్డికి ,జిల్లా మంత్రి  కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యులు బీర్ల అయిలయ్యకి హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ తెల్పిన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండల ఓబీసీ అధ్యక్షులు బత్తినీ ఉప్పలయ్య గౌడ్ మరియు మండల కాంగ్రెసు పార్టీ.

Read More చండూరు ప్రజా పాలన వార్డు సభలో రసాభాస  - ఇదేమి ప్రభుత్వం... ఇదేక్కడి న్యాయం..