రాజీవ్ యువ వికాసం పథకం ఉత్త మాటలేనా,, బీజేవైఎం మండల అధ్యక్షుడు మధుకర్
విశ్వంభర, మర్పల్లి:- కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువకుల కోసం రాజీవ్ యువ వికాసం ప్రతిష్టాత్మకమైన పథకాన్ని యువకులకు భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి రాజీవ్ వికాస్ పథకం రూపకల్పన చేశారు. ఆ పథకం ఇప్పుడు నీరుగార్చిందా అని మర్పల్లి మండల బీజేవైఎం అధ్యక్షుడు మధుకర్ ఎద్దేవా చేశారు, శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ వికాసం పతకం ఆ సమయంలో దరఖాస్తుకు సమయం లేదని హడావుడితో దూరప్రాంతాల నుండి వచ్చిన యువకులు మండల కేంద్రంలో కుల ఆదాయ సర్టిఫికెట్ల కోసం నిరుద్యోగ యువత వేరువేరు ప్రాంతాల నుంచి తమ గ్రామాలకు వచ్చి మండల కేంద్రంలో వారం 10 నెలల పాటు వారి సమయాన్ని వృధా చేసుకోవడం జరిగింది. మరి దరఖాస్తులను ప్రక్రియ తో రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్ల ఖజానా చేసుకుంది మరి ఇన్ని నెలలు గడుస్తున్నా ఎటువంటి సమాచారం లేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శమని అని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకము ద్వారా యువతకు మేలు చేస్తానని హామీ ఇచ్చిందో ఆమెని వెంటనే అమలు చేయాలని ఇచ్చిన హామీ పక్షంలో పెద్ద ఎత్తున మండల కేంద్రంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు అలాగే రాష్ట్రంలో చదువు కుంటున్నటువంటి పేద బాలికలకు మోటర్ స్కూటీల పంపిణీ చేస్తానని స్వయాన ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట మాయమయిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ గాల్లో మేడల కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు



